రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల సంచలనం రేపిన మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనిలో లాజిస్టిక్ మేనేజర్ అశోక్ ను భార్య పూర్ణిమ హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన పూర్ణి హార్ట్ అటాక్ గా మభ్యపెట్టినట్లు తెలిపారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. తమ స్టైల్ లో విచారణ చేపట్టి హత్య రహస్యాన్ని బయటపెట్టారు.
పూర్ణిమ ఓ యువకుడితో అక్రమసంబంధం పెట్టుకోవడంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను వేధించడం మొదలు పెట్టాడని.. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు పూర్ణిమ ప్లాన్ వేసిందని తెలిపారు పోలీసులు. ఇంట్లోనే చున్నీలతో గొంతు బిగించి అశోక్ ను చంపేసినట్లు తెలిపారు పోలీసులు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్, రక్తపు మచ్చలు ఉన్న దుస్తులు, బైక్, పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
