ఉదయ్ పైన కావాలని కుట్ర చేస్తున్నారు..! ట్రైనీ ఐపీఎస్ సోదరుడి రియాక్షన్ ఇది...!

ఉదయ్ పైన కావాలని కుట్ర చేస్తున్నారు..! ట్రైనీ ఐపీఎస్ సోదరుడి రియాక్షన్ ఇది...!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన NPA ఉదయ్ ని సస్పెండ్ చేసింది... 8 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం ( జులై 20 ) ఉదయం ఉదయ్ ఆత్మహత్యయత్నం చేయడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయ్ సోదరుడు ప్రణయ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ పై కావాలని కుట్ర చేస్తున్నారని అన్నారు ప్రణయ్.

 ఉదయ్ కష్టపడి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగాడని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల వల్ల ఉదయ్ చాలా బాధపడుతున్నాడని అన్నారు. శానిటైజర్ తాగాడని మాకు అనుమానం ఉందని అన్నారు ప్రణయ్. నేషనల్ పోలీస్ అకాడమీలో చాలా సెక్యూరిటీ ఉంటుందని..అంత సెక్యూరిటీ మధ్య ఒక అమ్మాయిని లాకెళ్లి గొంతు మీద కత్తి పెట్టడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.

కంప్లైంట్ చేసిన ట్రైనీ ఐపీఎస్ వీడియోలు, చాటింగ్ లు ఉదయ్ దగ్గర ఉన్నాయని.. ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుందని అన్నారు ఉదయ్ సోదరుడు ప్రణయ్.