Kajal Aggarwal: బంగ్లాదేశ్ హింసపై స్టార్ హీరోయిన్ నిప్పులు.. హిందువులారా మేల్కోండి అంటూ కాజల్ ఘాటు పోస్ట్!

Kajal Aggarwal: బంగ్లాదేశ్ హింసపై స్టార్ హీరోయిన్ నిప్పులు.. హిందువులారా మేల్కోండి అంటూ కాజల్ ఘాటు పోస్ట్!

టాలీవుడ్ చందమామగాపేరు తెచ్చుకుంది కాజల్ అగర్వా ల్. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 'లక్ష్మి 'కల్యాణం' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. అ తర్వాత వరుసగా మూవీల్లో అవకాశాలు అందుకుంది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే ఈ అమ్మడు పెండ్లి చేసుకుంది. దాంతో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీలో అదరగొడుతుంది.  ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ రామాయణం మూవీలో నటి స్తుందని ఇటీవలే అనౌన్స్ చేశారు. 

బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఘాటు స్పందన

ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. కాజల్ సమాజంలో జరుగుతున్న పరిణామాలు, వ్యక్తిగత అంశాలను అభిమానులతో పంచుకుంటుంది. కాగా బంగ్లాదేశ్ లో హందుపులపై జరిగిన దాడి యావత్ భారతీయుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనపై తాజాగా కాజల్ స్పం దించింది. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారుతుంది. 

ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు యావత్ భారతాన్ని కలచివేస్తున్నాయి. ముఖ్యంగా దీపూ చంద్రదాస్ అనే హిందువును అతి దారుణంగా హత్య చేసి, చెట్టుకు కట్టి తగలబెట్టినట్లు చెప్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘోర కలిని చూసి చలించిపోయిన కాజల్, తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యంత భావోద్వేగమైన పోస్ట్ చేశారు.

హిందువులారా..  మేల్కోండి..

"హిందువులారా. మేల్కోండి మౌనం మిమ్మల్ని రక్షించదు. 'అల్ ఐస్ ఆన్ లంగ్లా దేశ హిందూస్' అంటూ క్యాప్షన్ పెట్టింది. విరిగిన గుండె (broken heart), కన్నీళ్ల ఎమోజీలను జోడించారు. దీపూ చంద్రదాస్ అనే హిందువును దారుణంగా చంపి చెట్టుకు కట్టి తగలబెట్టిన ఎడిటెడ్ వీడియోను పోస్ట్ చేసింది.ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెలబ్రిటీల మౌనంపై ప్రశ్నిస్తూ..

సాధారణంగా వివాదాస్పద అంశాలపై స్పందించడానికి స్టార్ హీరోయిన్లు వెనుకాడతారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ప్రాణభయంతో ఉన్న తోటి మనుషుల కోసం గొంతుకయ్యారు. చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి సున్నితమైన విషయాల్లో మౌనంగా ఉంటారు, కానీ కాజల్ ధైర్యంగా స్పందించారు అంటూ అభిమానులు ఆమెను కొనియాడుతున్నారు.