బంగ్లాదేశ్ దగ్గర అన్ని యుద్ధ విమానాలు, ఆర్మీ ఉందా: ప్రపంచంలోనే 43వ శక్తి దేశంగా ఎందుకుంది..?

బంగ్లాదేశ్ దగ్గర అన్ని యుద్ధ విమానాలు, ఆర్మీ ఉందా: ప్రపంచంలోనే 43వ శక్తి దేశంగా ఎందుకుంది..?

ఢాకా: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత విషయంలో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మమద్ యూనస్ కూడా ఇండియా బద్ద వ్యతిరేకి. ఇండియా అంటే ఆయనకు ఏ మాత్రం గిట్టదు. బహిరంగంగానే భారత్‎కు వ్యతిరేకంగా విషం చిమ్ముతుంటారు. ఇదిలా ఉండగానే.. బంగ్లాదేశ్‎లో స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ కాల్చివేత.. ఆ తర్వాత హిందూ యువకుడి దారుణ హత్యతో ఆ దేశంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. 

బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో ఇండియా, బంగ్లా మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య పరిణామాలు వేగంగా మారుతోన్న క్రమంలో ఢాకా తన సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతోంది. మరీ బంగ్లాదేశ్ సైన్యం ఎంత శక్తివంతమైనది..? ఆ దేశం దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటివనే విషయం తెలుసుకుందాం. 

ప్రపంచంలో బంగ్లాదేశ్ సైన్యం 35వ శక్తివంతమైన దేశం:

గ్లోబల్ ఫైర్‌పవర్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 145 దేశాలలో సైనిక బలంలో బంగ్లాదేశ్ 35వ ప్లేస్‎లో ఉంది. వైమానిక శక్తి పరంగా చూసుకుంటే 43వ శక్తివంతమైన దేశం. బంగ్లాదేశ్ సైన్యం దగ్గర 56 స్వీయ చోదక ఫిరంగులు, 546 టోవ్డ్ ఫిరంగులు ఉన్నాయి. మొత్తం 110 రాకెట్ ఫిరంగి వ్యవస్థలు కలిగి ఉంది. 

అలాగే.. టర్కీ తయారు చేసిన అత్యాధునికి TRG-300 టైగర్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ (MLRS) ఆయుధ వ్యవస్థ కూడా బంగ్లాదేశ్ సైన్యం దగ్గరుంది. ఈ ఆయుధ వ్యవస్థ టైగర్ క్షిపణి, T-122/300 మల్టీ-కాలిబర్, మల్టీ-బారెల్ రాకెట్ లాంచింగ్ (MBRL) వ్యవస్థను అనుసంధానిస్తుంది. బంగ్లాదేశ్ ఈ రాకెట్ వ్యవస్థను 2021లో సుమారు $60 మిలియన్ల ఖర్చుతో టర్కీ నుంచి కొన్నది. 

ALSO READ : మా అన్నను చంపినోళ్లను ఉరి తీస్తేనే మాకు శాంతి

ఇక.. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ దగ్గర మొత్తం 214 సైనిక విమానాలను ఉన్నాయి. ఇందులో శక్తివంతమైన F-7, MiG-29, యాకోవ్లెవ్ యాక్-130 వంటి 42 యుద్ధ విమానాలు ఉండగా.. మరో 65 హెలికాప్టర్లు ఉన్నాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెన్నుముకగా పేరొందిన JF-17 థండర్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధ విమానం రేంజ్ 3,400 కి.మీ. ఈ విమానాన్ని చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.