ఈ అంశంలో జోక్యం చేసుకోలేం: GHMC డీలిమిటేషన్‎పై పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

 ఈ అంశంలో జోక్యం చేసుకోలేం: GHMC డీలిమిటేషన్‎పై పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల విభజన అంశంలో హైకోర్టులో ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‎కు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. కాగా, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు,7  కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.

దీనికి అనుగుణంగా జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కి పెంచింది. డివిజన్ల విభజన సరిగ్గా జరగలేదంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు..  జీహెచ్ఎంసీ వార్డుల విభజన అంశంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్లు కొట్టివేసింది. వార్డుల విభజనకు హైకోర్టులో లైన్ క్లియర్ కావడంతో ప్రభుత్వం నేడో, రేపో ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.