తెలంగాణకు పరిశ్రమలు రావొద్దని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.. పెట్టుబడులు వస్తుంటే అసూయ ఎందుకు.. : మంత్రి శ్రీధర్ బాబు 

తెలంగాణకు పరిశ్రమలు రావొద్దని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.. పెట్టుబడులు వస్తుంటే అసూయ ఎందుకు.. : మంత్రి శ్రీధర్ బాబు 

2023 ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్.. ఆదివారం ( డిసెంబర్ 21 ) మీడియా ముందుకు వచ్చి రేవంత్ సర్కార్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.. సీఎం సహా మంత్రులు, నేతలు కేసీఆర్ క్లూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణకు పరిశ్రమలు రాకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అతిపెద్ద పరిశ్రమలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని అన్నారు.

రూ. 5 లక్షల పెట్టుబడులకు మొన్న MOU లు చేసుకున్నామని.. పెట్టుబడుల ఒప్పందాన్ని కేసీఆర్ చాలా తేలికగా కొట్టిపడేస్తున్నారని అన్నారు శ్రీధర్ బాబు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా కందిస్తున్నామని.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే కేసీఆర్ కు అసూయ ఎందుకని ప్రశ్నించారు శ్రీధర్ బాబు.

ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీతో మాట్లాడుతున్నామని.. మీ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీ వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎకో సిస్టం ను డెవలప్ చేస్తున్నామని.. పెట్టుబడులు తీసుకురావడం నిరంతర ప్రక్రియ అని అన్నారు శ్రీధర్ బాబు.75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏడాదిలోనే తెచ్చామని అన్నారు శ్రీధర్ బాబు. ప్రపంచంలోనే అతిపెద్ద GCC కంపెనీ మనకు వచ్చిందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ముందుందని అన్నారు శ్రీధర్ బాబు.