దిల్ తూట్ గయా.. ఘర్ వాపసీ ఉండదు(మనసు విరి గిపోయింది. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరను) అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుండబద్ద లు కొట్టారు. రాష్ట్రంలో డైవర్ష స్. కరప్షన్ పాలిటిక్స్ నడుస్తు జనం బాట కార్యక్రమంలో భాగంగా జోగులాంబ న్నాయని అన్నారు. జాగృత్తి గద్వాల జిల్లాలో రెండో రోజు ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడు చూసినా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్, డెవలప్మెంట్ మా పాలసీ అంటూ అంటూ గొప్పలు చె బుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేవలం డ్రైవర్షన్ కరప్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు తన ఫ్యామిలీ మధ్య మేజర్ ఘటనలు జరిగాయన్నారు. తాను పార్టీలో ఉన్నప్పుడే తన భర్త ఫోన్ టాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడకపోవడంతో గుండె పగిలిపోయిందన్నారు. దీంతో మళ్లీ పార్టీలో చేరే చాన్స్ ఏమాత్రం లేదన్నారు. ఎడ్యుకేషన్ లో జోగులాంబ గద్వాల జిల్లా అట్టడుగు స్థానంలో ఉందని దీనిపై ఇక్కడి పాలకులు స్పందించాలన్నారు.
ఏమి అభివృద్ధి చేశారని రైజింగ్ తెలంగాణ వేడుకలు జరుపుకుంటు న్నారో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఆత్మ పరిశీ లన చేసుకోవాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతి వైపు నుంచి పార్టీ పెడతాం..2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని చెప్పారు. పేరు అదే ఉంటదా..? లేదా.? అనేది చెప్పలేమని అన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల మధ్యే ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీయేతనను ఎంపీగా ఓడించిందని చెప్పారు. తాను వద్దంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చార ని అన్నారు. వాస్తవానికి తాను ఎంపీ అడిగానని చెప్పారు.
