హాస్పిటల్ వార్డులో డాక్టర్, పేషెంట్ మధ్య గొడవ...పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. 

హాస్పిటల్ వార్డులో డాక్టర్, పేషెంట్ మధ్య గొడవ...పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. 

హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాలోని ఓ హాస్పిటల్లో డాక్టర్, పేషెంట్ మధ్య మొదలైన వాగ్వాదం తీవ్రస్థాయిలో కొట్టుకునే స్థాయికి చేరింది. డాక్టర్, పేషెంట్ ఒకరికొనొకరు పొట్టు పొట్టు కొట్టుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది,. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అర్జున్ పన్వర్ అనే రోగి ఎండోస్కోపీ కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి వెళ్ళాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ.. వేరే వార్డుకు వెళ్లి మంచం మీద పడుకున్నాడు అర్జున్. 

ఈ క్రమంలో అర్జున్ తో సదరు డాక్టర్ దురుసుగా ప్రవర్తించాడని.. అక్కడ మొదలైన వాగ్వాదం కాస్తా తీవ్రస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రోగి బంధువులు డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

డాక్టర్ పేషెంట్ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారిన క్రమంలో నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది డాక్టర్ దే తప్పంటూ కామెంట్ చేస్తుండగా.. విషయం పూర్తిగా తెలుసుకోకుండా డాక్టర్ ను నిందించడం కరెక్ట్ కాదని అంటున్నారు.

ఆక్సిజన్ కోసం అర్జున్ ని మరొక వార్డులో పడుకోమని ఓ డాక్టర్ చెప్పాడని.. ఈ క్రమంలో గొడవపడిన డాక్టర్ వచ్చి ప్రశ్నించగా.. అర్జున్ దురుసుగా సమాధానం చెప్పాడని.. దీంతో గొడవ మొదలైందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.