25 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన ఆఫ్గానిస్తాన్ రాయబారి

25 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన ఆఫ్గానిస్తాన్ రాయబారి

ఇలాంటి కేసు బహుశా ఇండియాలో ఇదే ఫస్ట్ టైం కావొచ్చు. విదేశీ రాయబారి కార్యాలయంలో పనిచేసే ఎంబస్సీ అధికారిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆఫ్ఘానిస్తాన్ దేశానికి చెందని దౌత్యవేత్త జకియా వార్దక్ 25 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ముంభై ఎయిర్ పోర్ట్‌లో దొరికిపోయింది. దుబాయ్ నుంచి జకియా వార్దక్ 25 కిలోల బంగారం దుస్తువుల్లో పెట్టి ఎలాంటి పత్రాలు లేకుండా ఇండియాకు తీసుకువచ్చింది. ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఆమె లగేజ్ చెక్ చేయగా ఈ విషయం బయట పడింది. ఈ ఘటన శనివారం జరిగింది. ఆమెను ఈ మే 4 నుంచి కాన్సుల్ జనరల్ పదవి నుంచి తప్పించారు. అయితే ఇంకో విషయం ఏంటంటే జకియా ఆఫ్గాన్ దేశంలో కాన్సుల్ జనరల్ పదవి పొందిన మొదటి మహిళ. 

ఆ బంగారం విలువ ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.18.6కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. జకియా వార్దక్ కు ప్రస్తుతం ఇండియాలోని ఆఫ్గనిస్తాన్ రాయబారి కార్యాలయంలో కాన్సుల్ జనరల్‍గా పనిచేస్తుంది. ఈమెకు ఉన్న అధికారం కారణంగా జాకియాను అరెస్ట్ చేయలేదు. కాకపోతే గోల్ట్ స్మగ్లింగ్ కేసు మాత్రం ఆమెపై  ఫైల్ చేశారు.  జకియాతోపాటు ఆమె చిన్న కొడుకు కూడా ఉన్నాడు. గోల్డ్ వ్యాల్యూ ఇండియన్ కరెన్సీలో రూ.కోటి కంటే ఎక్కువ ఉంటే అనుమానితుడిగా అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారుల విచారణ చేస్తారు. తనపై వచ్చిన గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలను జకియా కొట్టిపారేసింది. ఇలాంటి సమయంలో భారత్ తనకు సపోర్ట్‌గా ఉండాలని కానీ ఇలా చేస్తుంటే తనకు ఆశ్చర్యంగా ఉందని జకియా వార్దక్ అన్నారు.

జకియా వార్దక్ గత ఆఫ్గాన్ ప్రభుత్వ హయాంలో ముంబైలో కాన్సుల్ జనరల్‌గా నియమితులయ్యారు. భారత్ లో ఆఫ్గాన్ రాయబార కార్యాలయాన్ని మూసివేసిన తర్వాత కూడా ఆమె ఆ స్థానంలో కొనసాగారు. భారతదేశం అధికారికంగా తాలిబాన్ పరిపాలనను గుర్తించనప్పటికీ దౌత్యపరమైన  సంబంధాలు కాబూల్‌ నుంచి జరుగుతున్నాయి.