బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు పోలీస్ కస్టడీ

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు పోలీస్ కస్టడీ

బీఆర్ఎస్  నేత క్రిశాంక్ కు  ఒక్క రోజు  పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది నాంపల్లి కోర్టు.  ఓయూ సర్కులర్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసిన  క్రిశాంక్ .. ప్రస్తుతం చంచల గూడ జైల్లో ఉన్నారు. మే 5 న  చంచల్ గూడ జైల్ నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు  పోలీసులు. 

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లు, మెస్​ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్​చార్జ్ మన్నె క్రిశాంక్ ను మే 1న  పోలీసులు అరెస్టు చేశారు. క్రిశాంక్, ఓయూ ఓల్డ్ స్టూడెంట్ నాగేందర్ కలిసి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు క్రిశాంక్ ను రెండు రోజుల కస్టడీకి కోరారు. దీంతో కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతిచ్చింది.