వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. కారు కింద పడి ఏడేళ్ల బాలిక మృతి

వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. కారు కింద పడి ఏడేళ్ల బాలిక మృతి

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో దారుణం జరిగింది. సర్పంచ్ కమ్లిబాయ్ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో సౌజన్య అనే ఏడేళ్ల బాలిక కారు కింద పడింది. తీవ్రంగా గాయపడ్డ బాలికను ఆసుపత్రికి తరలించారు. 

తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సౌజన్య మృతి చెందింది. అయితే.. ర్యాలీలో కారు కింద పడలేదంటూ సర్పంచ్ కమ్లిబాయ్ భర్త పెంటయ్య వాదించాడు. దీంతో గ్రామస్థులు, పెంటయ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.