హైదరాబాద్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హవేలి ఘనపూర్ (మం) శాలిపేట దగ్గర ఓ బైక్ వెనక నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
