మున్సిపల్ ఎన్నికల రోజున సెలవు : కలెక్టర్ ప్రావీణ్య

మున్సిపల్ ఎన్నికల రోజున సెలవు : కలెక్టర్ ప్రావీణ్య
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య 

సంగారెడ్డి, వెలుగు:- ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11 (బుధవారం) ప్రభుత్వ సెలవుగా  ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..  సంగారెడ్డి,  సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, నారాయణఖేడ్, జిన్నారం, అందోల్–జోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సంస్థలకు పబ్లిక్ హాలిడే వర్తిస్తుందని తెలిపారు. 

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 

పోలింగ్ నిర్వహణకు వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు ఫిబ్రవరి 10 (మంగళవారం) కూడా సెలవు ప్రకటించినట్లు తెలిపారు.  ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థల భవనాలకు లెక్కింపునకు ముందు రోజు ఫిబ్రవరి 12 (గురువారం), లెక్కింపు రోజు ఫిబ్రవరి 13 (శుక్రవారం) రెండు రోజుల పాటు లోకల్ హాలిడే వర్తిస్తుందని పేర్కొన్నారు.