- మైనారిటీ మినిస్టర్ అజారుద్దీన్
తూప్రాన్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అని మైనారిటీ మినిస్టర్ అజారుద్దీన్అన్నారు. శనివారం తూప్రాన్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫామ్‌హౌస్ కే పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. తూప్రాన్ పట్టణానికి డిగ్రీ కాలేజీని తీసుకొస్తామన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎలక్షన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మున్సిపల్ వార్డు సభ్యుల అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు
పాల్గొన్నారు.
ఫామ్ హౌస్ అభివృద్ధి చేసుకున్నడు..
గజ్వేల్: కేసీఆర్ పదేళ్ల పాలనలో గజ్వేల్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు గానీ ఫామ్‌హౌస్‌ను మాత్రం డెవలప్చేసుకున్నారని మంత్రి అజారుద్దీన్ ఆరోపించారు. శనివారం ఆయన గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి కూన శ్రీశైలం గౌడ్, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికైనా గజ్వేల్ ప్రజలు వాస్తవాలను గుర్తించి మార్పు కోరుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల మాదిరిగానే గజ్వేల్‌లో బీఆర్ఎస్‌కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
