రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని సాగర్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ( ఫిబ్రవరి 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. యాచారంలోని సాగర్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మంచాల మండలం వెంకటేశ్వర తండా గ్రామానికి చెందిన జాతవత్ హరియాగా గుర్తించారు పోలీసులు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హరియాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యాచారం పోలీసులు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బెటాయించారు బంధువులు.హరియా మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది.
