- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మెదక్ కలెక్టరేట్లో అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహంచారు. కలెక్టర్మాట్లాడుతూ..పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్స్‌ల ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు ఏవిధంగా చేపట్టాలి, కౌంటింగ్ టేబుల్స్, రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజెంట్లు, అభ్యర్థులతో వ్యవహరించాల్సిన తీరువంటి అంశాలపై అవగాహన ఉండాలన్నారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ఓట్ల లెక్కింపు నిర్వహించాలన్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు కలిపి 31 కౌంటింగ్ సూపర్వైజర్లు, 62 కౌంటింగ్ అసిస్టెంట్స్‌ను నియమించామన్నారు. ఒక రిటర్నింగ్ అధికారికి ఒక టేబుల్ చొప్పున నాలుగు మున్సిపాలిటీలకు 26 టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఫిబ్రవరి- 13న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, సిబ్బంది అందరూ ఐడీ కార్డులు ధరించి ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటలకల్లా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిర్వహించి అనంతరం రెండు దశల్లో బ్యాలెట్ బాక్సుల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని చెప్పారు.
మొదటి దశలో ప్రాథమిక కౌంటింగ్, రెండో దశలో వివరణాత్మక కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తరచుగా ఎదురయ్యే వివిధ సంఘటనలను ఏవిధంగా పరిష్కరించాలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తూప్రాన్ : పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం తూప్రాన్ మున్సిపల్ ఆఫీస్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ గణేశ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు డ్యూటీ ఆర్డర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు తీసుకునిరావాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పావని రావు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
