చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మున్సిపాలిటీలో గండీడ్, పరిగి, తాండూరు ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఓట్లను కాంగ్రెస్ నేతలు నమోదు చేయించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. దొంగ ఓటర్లు ఓటు వేసేందుకు వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల మున్సిపాలిటీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాను ఎక్కడ ఉన్నా తన ప్రాణం చేవెళ్ల చుట్టే తిరుగుతుందని, తాను చచ్చినా చేవెళ్ల చెల్లెమ్మ చనిపోయిందనే అంటారన్నారు. అధికార పార్టీ బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.
