సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న రంగా థియేటర్ పక్క గల్లీలో శనివారం రాత్రి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వివరాళ్లోకి వెళ్తే.. టిఫిన్ సెంటర్లు, దుకాణాలతో రద్దీగా ఉండే రంగా థియేటర్ ప్రాంతంలో పేలుడు ధాటికి డ్రైనేజీపై ఉన్న కాంక్రీట్ పలకలు ముక్కలై గాలిలోకి ఎగిరిపడటంతో పాటు, సమీపంలోని ఒక జ్యూస్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు జ్యూస్ సెంటర్‌లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఈ పేలుడుకు గ్యాస్ లీకేజీయే కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.
A gas cylinder explosion occurred near Ranga Theatre in Kodad on Saturday night.
— Hate Detector 🔍 (@HateDetectors) July 5, 2026
Locals suspect the blast originated at an LPG refill shop.
No casualties or injuries were reported in the incident.
Police have registered a case and launched an investigation into the cause of… pic.twitter.com/gWGNfujilc
