సీసీటీవీ బ్యాకప్ 30 రోజులు ఉంచాలి..ఫామ్హౌస్లు, రిసార్ట్లలో పార్టీలకు పర్మిషన్మస్ట్: ఫ్యూచర్సిటీ సీపీ తరుణ్జోషి

సీసీటీవీ బ్యాకప్ 30 రోజులు ఉంచాలి..ఫామ్హౌస్లు, రిసార్ట్లలో పార్టీలకు పర్మిషన్మస్ట్: ఫ్యూచర్సిటీ సీపీ తరుణ్జోషి

చేవెళ్ల, వెలుగు: ఫామ్​హౌస్​లలో పార్టీలు, లిక్కర్​వాడకానికి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని ప్యూచర్​సిటీ సీపీ తరుణ్​జోషి ఆదేశించారు. శనివారం మొయినాబాద్​లోని ఓ రిసార్ట్​లో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్ ఠాణాల పరిధిలో గల 750కు పైగా ఫామ్‌‌హౌస్‌‌లు, రిసార్ట్​ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ప్రతీ ఫామ్‌‌హౌస్, రిసార్ట్​లో సీసీటీవీ బ్యాకప్​కనీసం 30 రోజులు ఉంచాలన్నారు.

రేవ్, డ్రగ్స్, హుక్కా పార్టీలు, జూదంపై నిషేధం ఉందని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గెస్ట్​ల వివరాలు ఆన్ లైన్​లో నమోదు చేసేందుకు సేఫ్​అతిథి యాప్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేశ్​గౌతమ్, ఏసీపీ కిషన్ తదితరులు పాల్గొన్నారు.