ఇంటర్ అమ్మాయిని అమ్మ తీసుకురమ్మందని చెప్పి కిడ్నాప్.. నలుగురిపై పోక్సో కేసు

ఇంటర్ అమ్మాయిని అమ్మ తీసుకురమ్మందని చెప్పి కిడ్నాప్.. నలుగురిపై పోక్సో కేసు

కారేపల్లి, వెలుగు: ఇంటర్ చదువుతున్న ఓ బాలికను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో నలుగురిపై ఖమ్మం జిల్లా కారేపల్లి పీఎస్​లో ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై గోపి వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణం టేకులపల్లి ప్రాంతంలో నివాసముండే బాజీ అనే యువకుడు మరో ముగ్గురుతో కలిసి మూడు రోజుల కింద కారేపల్లి మైనార్టీ కళాశాలకు వెళ్లారు. 

ఇంటర్ చదివే బాలికను తన తల్లి తీసుకురామన్నదని మాయమాటలు చెప్పి బాలికను బయటికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు బాలికను తీసుకెళ్లిన నలుగురిని గుర్తించి పోక్సో కేసు నమోదు చేశారు. బాజీకి సహకరించిన అతడి అక్క అప్సర్, పిన్ని మున్ని, శ్రావణి మరో యువతి పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.