తిరుపతి ఎయిర్ పోర్టులో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘనస్వాగతం పలికిన అభిమానులు.. 

తిరుపతి ఎయిర్ పోర్టులో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘనస్వాగతం పలికిన అభిమానులు.. 

తిరుపతి ఎయిర్ పోర్టులో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘనస్వాగతం పలికారు అభిమానులు. మంగళవారం ( డిసెంబర్ 23 ) తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న మంత్రి వివేక్.. ఇవాళ సతీసమేతంగా తిరుపతి చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

మల్లారపు మధు ఆధ్వర్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘనస్వాగతం పలికిన అభిమానులు గజమాలతో వివేక్ దంపతులను సత్కరించారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు వివేక్ సరోజ దంపతులు.