ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యను మాదాపూర్ ల్యాండ్ పేరుతో 25 లక్షలకు ముంచేసిన కేటుగాళ్లు

ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యను మాదాపూర్ ల్యాండ్ పేరుతో 25 లక్షలకు ముంచేసిన కేటుగాళ్లు

హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్సీ రామ చంద్రయ్యకు కేటుగాళ్ల టోకరా వేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్లో 5 ఎకరాల స్థలం తమదేనని, తక్కువ ధరకు ల్యాండ్ అమ్ముతామని ఎమ్మెల్సీకి నిందితులు టోకరా వేశారు. అడ్వాన్స్ అమౌంట్గా 25 లక్షల రూపాయలు ఎమ్మెల్సీ నుంచి నిందితులు వసూలు చేశారు. ల్యాండ్ పత్రాలు అడిగితే కేటుగాళ్లు ముఖం చాటేయడంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది.

మాదాపూర్‌ 100 అడుగుల రోడ్డులోని 5.5 ఎకరాల స్థలాన్ని రామచంద్రయ్యకు విక్రయించేందుకు పేరూరి తులసీగోపాల్‌, అతని కొడుకు గిరిధర్‌  రామచంద్రయ్యతో బేరం చేశారు. రామచంద్రయ్య టోకెన్‌ అడ్వాన్సుగా రూ.25 లక్షలు RTGSలో చెల్లించారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించమని అడిగితే తండ్రీకొడుకు రేపుమాపంటూ తప్పించుకుని తిరుగుతున్నారు.

మోసపోయానని గ్రహించిన సదరు ఎమ్మెల్సీ మాదాపూర్లో నిందితులు చెబుతున్న 5 ఎకరా ల్యాండ్పై ఆరా తీశారు. ల్యాండ్కు, నిందితులకు ఎలాంటి సంబంధం లేదని గ్రహించిన ఎమ్మెల్సీ మోసపోయానని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితులు ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.