ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూటమి సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ పై శుక్రవారం ( అక్టోబర్ 9 ) విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో సమగ్ర కుటుంబసర్వే వివరాలు ఎలా పరిగణలోకి తీసుకుంటారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం హాట్ టాపిక్ గా మారింది. మరి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
