ఏడాదికి 9 కోట్ల మంది ప్రయాణికులు: ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా ?

ఏడాదికి 9 కోట్ల మంది ప్రయాణికులు: ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా ?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజూ సుమారు రెండున్నర కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే భారతదేశంలోనే అత్యధికంగా ప్రయాణికుల రాకపోకలు సాగించే టాప్ 100 రైల్వే స్టేషన్ల లిస్టును  (2023-24 సంవత్సరానికి) రైల్వే శాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ లిస్టులో మహారాష్ట్రలోని థానే (Thane) రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏడాదికి ఏకంగా 9.30 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. 

భారతదేశంలోని టాప్ 10 అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు

1. థానే (మహారాష్ట్ర) రైల్వే స్టేషన్లో ఏడాదికి 9.30 కోట్ల ప్రయాణికులు పయనిస్తుంటారు. 
2. కళ్యాణ్ (మహారాష్ట్ర) రైల్వే స్టేషన్లో 8.37 కోట్లు, 
3. హౌరా (పశ్చిమ బెంగాల్) 6.13 కోట్లు
4. ముంబై CSMT (మహారాష్ట్ర) 5.16 కోట్లు 
5. సీల్దా (పశ్చిమ బెంగాల్) 5.13 కోట్లు 
6. పన్వెల్ (మహారాష్ట్ర) 4.62 కోట్లు 
7. న్యూఢిల్లీ    3.96 కోట్లు 
8. తాంబరం (తమిళనాడు) 3.27 కోట్లు
9. దాదర్ (మహారాష్ట్ర) 3.22 కోట్లు
10. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ 3.05 కోట్లు

ముంబై ప్రాంతానిదే హవా!
టాప్ 10 అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో 5 స్టేషన్లు ఒక్క ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతానివే కావడం విశేషం. థానే, కళ్యాణ్, ముంబై సీఎస్‌ఎంటీ (CSMT), పన్వెల్, దాదర్ స్టేషన్లు నిత్యం లోకల్ సహా దూరప్రాంత ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. అంతేకాకుండా, ముంబై సెంట్రల్ స్టేషన్ 2.20 కోట్ల మంది ప్రయాణికులతో 16వ స్థానంలో నిలిచింది.

దేశరాజధాని, ఇతర ప్రాంతాల పరిస్థితి
 న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 3.96 కోట్ల మంది ప్రయాణికులతో 7వ స్థానంలో నిలిచింది. అలాగే హజ్రత్ నిజాముద్దీన్ (24వ స్థానం), ఢిల్లీ సరాయ్ రోహిల్లా (95వ స్థానం) కూడా లిస్టులో ఉన్నాయి.

సౌత్ సైడ్ చూస్తే  చెన్నైలోని తాంబరం (8వ స్థానం), చెన్నై సెంట్రల్ (10వ స్థానం), బెంగళూరు KSR (12వ స్థానం), చెన్నై ఎగ్మోర్ (18వ స్థానం), తిరుపతి (26వ స్థానం) నిలిచాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి  ప్రధానంగా తిరుపతి (1.37 కోట్లు - 26వ స్థానం), విశాఖపట్నం (1.33 కోట్లు) స్టేషన్లలో ఏడాదికి కోటికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. విజయవాడ కూడా టాప్ 100లో చోటు దక్కించుకుంది.

ఏడాదికి కోటికి పైగా ప్రయాణికులు వచ్చే కొన్ని ప్రముఖ  స్టేషన్లు చూస్తే తిరుపతి, విశాఖపట్నం, కాన్పూర్ సెంట్రల్, గోరఖ్‌పూర్, తిరువనంతపురం, భువనేశ్వర్, ఆనంద్ విహార్ (ఢిల్లీ), భోపాల్, వారణాసి, కోజికోడ్, మధుర, కోయంబత్తూర్, నాగ్‌పూర్ ఇంకా బాంద్రా జంక్షన్ ఉన్నాయి.

ఈ టాప్ 100 లిస్టులో చివరి స్థానమైన (100వ స్థానం) లో కేరళలోని ఎర్నాకులం టౌన్ స్టేషన్ 50.13 లక్షల మంది ప్రయాణికులతో నిలిచింది.