ముల్తానీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

ముల్తానీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

ఆదిలాబాద్, వెలుగు: ముల్తానీ సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిమెన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామంలో గుండాల, కేశపట్నం, ఎల్లమ్మగూడ, జోగిపేట గ్రామాల ముల్తానీలతో తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే కలీమ్, ఎంపీడీవో నరేశ్ సమావేశమయ్యారు. ముల్తానీ సమాజ ప్రజలతో కమిటీ సభ్యులు సమావేశమై, వారి సమస్యలు, అవసరాలు, అభివృద్ధికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.