ఖమ్మం టౌన్, వెలుగు: టీటీడీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని అల్లిపురంలో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్ తో కలిసి భూమి పూజ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12 జరిగే భూమి పూజ కార్యక్రమానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి హాజరుకానున్నట్లు చెప్పారు. వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
