
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ లో హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ కి చెందిన రూ. 75 కోట్ల విలువైన ఇల్లు కబ్జా చేసినట్లు బండ్ల గణేష్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫిలిం నగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు తన ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు తనను నిర్బంధించి బెదిరింపులకు గురి చేశారని చెప్పింది. ఫిర్యాదు చేసినా ఫిలంనగర్ పోలీసులు పట్టించుకోలేదని తిరిగి తనపైనే చేశారని తెలిపింది.
ఈ వ్యవహారంపై నౌహెరా షేక్ గతంలో డీజీపీని సంప్రదించగా, మార్చి 26న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)లో కూడా కేసు నమోదైంది.ఉన్నతాధికారుల ఆదేశంతో బండ్ల గణేష్ మీద ఐపిసి 341,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు.