హైదరాబాద్‌‌లో ఫియట్ గ్లోబల్ డిజిటల్ హబ్

హైదరాబాద్‌‌లో ఫియట్ గ్లోబల్ డిజిటల్ హబ్

రూ.1,103 కోట్ల పెట్టుబడి

వెయ్యి మందికి ఉద్యోగాలు

నార్త్‌‌ అమెరికా బయట అతిపెద్ద సెంటర్ ఇదే

హైదరాబాద్, వెలుగు: ఆటో కంపెనీ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్‌‌సీఏ) తన గ్లోబల్ డిజిటల్ హబ్‌‌ను హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేయబోతుంది. రూ.1,103 కోట్ల(150 మిలియన్ డాలర్ల) ఇన్వెస్ట్‌‌మెంట్‌‌తో ఈ డిజిటల్ హబ్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఫియట్ బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఆటోమొటివ్ ఆపరేషన్స్‌‌కు అవసరమైన కొత్త టెక్నాలజీలను ఈ డిజిటల్ హబ్‌‌లోనే డెవలప్ చేయనుంది. నార్త్ అమెరికా బయట ఎఫ్‌‌సీఏ ఏర్పాటు చేసిన అతిపెద్ద డిజిటల్ హబ్‌‌ ఇదే కావడం విశేషం. వచ్చే ఏడాది చివరి కల్లా సుమారు వెయ్యి ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని ఎఫ్‌‌సీఏ ప్రకటించింది.

గతేడాది తమ స్ట్రాటజీని రివ్యూ చేసే క్రమంలో భాగంగా.. గ్లోబల్ డిజిటల్ హబ్‌‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఎఫ్‌‌సీఏ నార్త్ అమెరికా, ఆసియా పసిఫిక్ సీఐఓ మమతా చామర్తి వర్చ్యవల్ ఈవెంట్ సందర్భంగా అన్నారు. ఈ డిజిటల్ హబ్ ద్వారా గ్లోబల్‌‌గా, ఇండియాలో ఉన్న ఎఫ్‌‌సీఏ ఆటోమొబైల్స్‌‌ ఆపరేషన్స్‌‌ను పూర్తిగా డిజిటైజ్ చేస్తామని పేర్కొన్నారు. కంపెనీ ప్రస్తుత అప్లికేషన్స్‌‌ను, ప్రొడక్ట్ పోర్ట్‌‌ఫోలియోను ఆధునీకరిస్తామని మమతా చెప్పారు. ప్రపంచంలో ఐటీ లీడర్‌‌‌‌గా ఇండియా ఉందని, ఇక్కడ డిజిటల్ టాలెంట్ ఎక్కువగా ఉందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్, వ్యాపారాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఇన్వెస్ట్‌‌మెంట్ ఫ్రెండ్లీ పాలసీలు తాము ఇక్కడ డిజిటల్ హబ్‌‌ ఏర్పాటు చేసేందుకు సహకరించినట్టు వివరించారు. ఇండియాలో నెంబర్ వన్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు. గ్లోబల్ ఐటీ కంపెనీలన్ని హైదరాబాద్‌‌ నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని, పబ్లిక్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ కూడా అందరికీ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కారణాల చేత తాము ఇండియాలో హైదరాబాద్ ను తమ డిజిటల్ హబ్‌‌ ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్నామని పేర్కొన్నారు.  హైదరాబాద్ సెంటర్‌‌‌‌ ఫియట్ క్రిస్లర్ గ్లోబల్ టీమ్‌‌లో భాగంగా పనిచేస్తుంది. ఇండియాలో బెస్ట్ డిజిటల్ టాలెంట్‌‌ను ఇది నియమించుకుంటుందని మమతా తెలిపారు. ఇండియాలో తన సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఇంజనీరింగ్ కాలేజీలతో, సప్లయిర్స్‌‌తో, స్టార్టప్‌‌లతో కూడా తాము కలిసి పనిచేస్తామన్నారు.

కనెక్టెడ్ వెహికల్ సర్వీసెస్, డేటా సైన్సస్, క్లౌడ్ సర్వీసులు వంటి కొత్త టెక్నాలజీలపై తమ ఫోకస్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది కొత్త కరెన్సీగా ఉందని, ఇన్నొవేషన్‌‌ పవర్‌‌‌‌హౌస్‌‌ను అభివృద్ధి చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కస్టమర్ అంచనాలకు అనుగుణంగా తమ కొత్త ప్రొడక్ట్‌‌లు, సర్వీసులను అందిస్తామన్నారు. మహారాష్ట్ర, తమిళనాడులో కూడా ఎఫ్‌‌సీఏ తన ఆపరేషన్స్‌‌ను కొనసాగిస్తోంది. ముంబైలో హెడ్‌‌క్వార్టర్‌‌‌‌ ఉంది. మన దేశంలో మూడు వేల మందికి పైగా ఉద్యోగులు ఎఫ్‌‌సీఏలో పనిచేస్తున్నారు. గ్లోబల్ డిజిటల్ హబ్‌‌తో ఈ ఆటో కంపెనీ తెలంగాణలోకి విస్తరించింది. ‘150 మిలియన్ డాలర్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌తో హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేస్తోన్న  గ్లోబల్ డిజిటల్ హబ్‌‌ ద్వారా ఇండియాలో మా కస్టమర్లకు సేవలందించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని ఎఫ్‌‌సీఏ ఐసీటీ ఇండియా హెడ్, డైరెక్టర్ కరీమ్ లాహాని అన్నారు. తమ గ్లోబల్ డిజిటల్ హబ్‌‌ కస్టమర్ సేఫ్టీ, కనెక్టెడ్ మొబిలిటీ, డిజిటల్ షోరూం ఎక్స్‌‌పీరియెన్స్ వంటి పలు విభాగాల్లో ఇన్నొవేషన్‌‌ను అందిస్తుందని పేర్కొన్నారు.

ఎఫ్‌‌సీఏ గ్లోబల్ డిజిటల్ హబ్‌‌ను స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సాయాలందిస్తాం. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తెచ్చింది. ఈవీలో చాలా అవకాశాలున్నాయి. రాబోతున్న యువతరాన్ని ఫియట్ ఆకర్షిస్తుంది. -కేటీ రామారావు, రాష్ట్ర ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి

తెలంగాణ ప్రభుత్వం ఫియట్‌కు భాగస్వామిగా ఉంటుంది. కార్పొరేట్‌ సెక్టార్‌‌లో ఇన్నొవేషన్స్ పెరిగాయి. ఎమర్జింగ్ టెక్నాలజీలకు హైదరాబాద్ హబ్‌‌గా మారుతోంది. -జయేశ్ రంజన్,  ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం.