వరల్డ్ కప్ ఫైనల్ లో ట్రోఫీని లాంచ్ చేయనున్న దీపిక

వరల్డ్ కప్ ఫైనల్ లో ట్రోఫీని లాంచ్ చేయనున్న దీపిక

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనెకి అరుదైనా గౌరవం దక్కింది. హాలీవుడ్ లోనూ అలరిస్తున్న ఈ భామ, ఇంటర్నేషనల్ వేదికపై మెరిసేందుకు మరొక అవకాశాన్ని కొట్టేసింది. ఖతార్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఈవెంట్ నుంచి ఆహ్వానం అందుకుంది. ఫిపా వరల్డ్ కప్ ఫైనల్ కి ముందు ట్రోఫీని ఆవిష్కరించే అవకాశాన్ని దక్కించుకుంది. 

ఫిఫా చరిత్రలో ఇలా ఓ నటికి ట్రోఫీని లాంచ్ చేసే అవకాశం రావడం ఇదే మొదటిసారి. దీపిక ట్రోఫీని లాంచ్ చేయడం భారతదేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఇదే కాకుండా ఈ మధ్య జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియా తరుపున జ్యూరీ మెంబర్ గా కూడా వ్యవహరించింది దీపిక. ఇప్పుడు ఈ ఫైనల్ ఈవెంట్ లో దీపికానే కాకుండా మరొక బాలీవుడ్ నటి నోరా ఫతేహి వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీలో పర్ఫార్మ్ చేయనుంది. అయితే, డిసెంబర్ 18 లూసెయిల్ స్డేడియంలో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది.