Balakrishna: బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ.. సినీ, రాజకీయాల్లో ఎవరెవరు విష్ చేశారంటే?

Balakrishna: బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ.. సినీ, రాజకీయాల్లో ఎవరెవరు విష్ చేశారంటే?

సినీ నటుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు నేడు (జూన్ 10). ఈరోజు 65వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ X వేదికగా విషెష్ చెబుతూ నోట్ రిలీజ్ చేశారు. 

‘‘శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి మెప్పు పొందిన కథానాయకుడాయన. ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపారు. 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలుగు సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన మీరు.. నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని బాలయ్యతో దిగిన ఫోటో పంచుకున్నారు. 

నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే బాబాయ్‌’ అని తెలిపారు. 

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషెష్ చేస్తూ.. ‘మన సింహానికి మరిన్ని శుభాశీస్సులు..  బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు’ అని ఫోటోలు షేర్ చేశాడు. 

డైరెక్టర్ గోపీచంద్ మలినేని విషెష్ చెబుతూ.. ‘ మన గాడ్ అఫ్ మాసెస్.. నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ✨
మీరు చాలా సంవత్సరాలుగా మమ్మల్ని అలరించారు. ఇప్పుడు NBK111 చారిత్రక గర్జనతో మీ ప్రయాణంలో భాగం కావడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. ముందున్న సంవత్సరం మీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సార్’  అని తనదైన శైలిలో విషెష్ తెలిపారు. ఇకపోతే.. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత.. గోపీచంద్ మలినేని బాలకృష్ణతో మరో సినిమా చేస్తున్నాడు. 

ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్‌ విషెష్ చెబుతూ.. ‘సిల్వర్‌ స్క్రీన్‌పై ఆయన లెజెండ్‌.. పొలిటికల్‌ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్‌.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య పద్మభూషణ్‌ బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని లోకేష్ తన ప్రేమను వ్యక్తపరిచారు. 

అంతేకాకుండా.. దిల్ రాజు, మైత్రి మేకర్స్, గీత ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, డైరెక్టర్ సంపత్ నంది, బాబీ, త్రివిక్రమ్ ..ఇలా అనేకమంది బాలకృష్ణకు విషెస్ తెలిపారు.  
 

ఇటీవలే బాలకృష్ణకు భారత ప్రభుత్వం.. దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ అవార్డును 2025 జనవరి 25న ప్రకటించింది. ఆయన ఏప్రిల్ 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులలో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుకు నందమూరి బాలకృష్ణను ఎంపిక చేసారు. జూన్ 14న అవార్డుతో సత్కరించనుంది.