రాజ్యసభ ఎంపీగా విజయేంద్ర ప్రసాద్ బాధ్యతలు

రాజ్యసభ ఎంపీగా విజయేంద్ర ప్రసాద్  బాధ్యతలు

రాజ్యసభ సభ్యుడిగా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు విజయేంద్రప్రసాద్ చేత ప్రమాణం చేయించారు. విజయేంద్రప్రసాద్ ను కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపిక చేసింది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపిగా ప్రమాణం చేసిన విజయేంద్రప్రసాద్..2027 వరకు ఆయన ఎంపీగా కొనసాగనున్నారు. 

సొంతూరు..
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి జిల్లా కోవ్వూరులో విజయేంద్ర ప్రసాద్ జన్మించారు. ఆయన తండ్రి ఒక కాంట్రాక్టర్. ఆరుగురు సోదరులు, ఒక సోదరి. విజయేంద్ర ప్రసాద్ అందరికంటే చిన్నవాడు.  విజయేంద్ర అన్న శివదత్తాకు కళలు, కవిత్వంపై ఆసక్తి ఉండేది. దర్శకుడిగా మారేందుకు మద్రాసు వెళ్లారు. అయితే చాలా చిత్రాలకు స్ర్కిప్ట్ రాసినా సక్సెస్ కాలేకపోయాడు. శివదత్తాతో కలిసి విజయేంద్రప్రాసద్ స్టోరీలు రాయడం నేర్చుకున్నాడు. అలా బంగారు కుటుంబ సినిమాకు తొలి స్టోరీని అందించాడు. ఆ ర్వాత  బొబ్బిలి సింహం, ఘరానా బుల్లొడు, జానకి రాముడు,సమరసింహరెడ్డి, సై, నా అల్లుడు, ఛత్రపతి, మగధీర వంటి సినిమాలకు కథను అందించాడు. 

బాహుబలితో ప్రపంచం దృష్టికి..
బాహుబలి సినిమాకు విజయేంద్ర ప్రసాదే స్టోరీ అందించాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ కావడంతో..ఒక్కసారిగా విజయేంద్ర ప్రసాద్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత RRR సినిమాకు స్ర్కిప్ట్ అందించాడు.తెలుగులోనే కాదు..బాలీవుడ్‏లో సూపర్ హిట్ చిత్రాలకు కథలు రాశారు. రౌడీ రాథోర్,బజరంగీ భాయిజాన్, మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ,తలైవి సినిమాలకు కూడా విజయేంద్ర ప్రసాదే స్టోరీలు అందించారు.