అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్​కౌంటర్​

అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్​కౌంటర్​
  • నిజాలే చెప్పే నీతిమంతులైతిరి
  • సిగ్గుండాలే మాట్లాడనీకే
  • అబద్దాల గురించి మీరే చెప్పాలే

హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ బతుకే ఇంత.. రోజుకో మాట పూటకో అబద్దం’ అంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ‘ఇగ అబద్దాల గురించి మీరే చెప్పాలే మాకు..!! దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న దగ్గరి నుండి.. అదే దళితుడికి మూడెకరాల భూమి ఇస్తానన్న నిక్కమైన నిజాలే మాట్లాడే నీతిమంతులైతిరి!! సిగ్గుండాలే మాట్లాడనీకే.!!’ అంటూ ఓటమితో మెదడు సన్నబారి.. సన్నవడ్ల మీద రాజకీయం మొదలెట్టిన సన్నాసి.. ఇంకెన్ని విషప్రచారాలు చేస్తావ్?మాటకు హద్దుండాలే.. గెలుపుపై ఆశలు సన్నగిల్లి.. సన్న వడ్లపై ఏంది మీ లొల్లి?! అని కేసీఆర్ ఫొటోను అటాచ్​చేస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.