గడ్కరీ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. నటుడు ఎవరంటే?

గడ్కరీ ఫస్ట్ లుక్ వచ్చేసింది..  నటుడు ఎవరంటే?

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న మరాఠీ చిత్రం గడ్కరీ. ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో గడ్కరీ పాత్రను నటుడు రాహుల్ చోప్డా చేయనున్నారు. అనురాగ్‌ రంజన్‌ బసూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని  2023 అక్టోబర్  27 న రిలీజ్ చేయనున్నారు. 

నితిన్ గడ్కరీ జీవితంలోని టచ్ చేయని కోణాలను ప్రేక్షకులు తెరపై చూడనున్నారు. సినిమాలో గడ్కరీ పోరాటం, జన్‌సంఘ్‌ నుంచి బీజేపీకి ప్రయాణం, సంఘ్‌ వాలంటీర్‌గా ఆయన చేసిన కృషి, రాజకీయ ప్రయాణం వంటి అంశాలను సినిమా ద్వారా చూపించనున్నారు. ఈ సినిమా మరాఠీలో రూపొందుతోంది.

బాలీవుడ్‌లో బయోపిక్ సంప్రదాయం కొత్తేం కాదు, గత కొన్నేళ్లుగా ఈ సిరీస్‌లో పలువురు రాజకీయ నాయకులపైనా సినిమాలు వచ్చాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రేపై బయోపిక్ లు రూపొందాయి.