లుట్ పుట్ గయా .. డంకీ నుంచి ఫస్ట్ సాంగ్‌‌‌‌ లాంచ్

లుట్ పుట్ గయా ..  డంకీ నుంచి ఫస్ట్ సాంగ్‌‌‌‌ లాంచ్

బాలీవుడ్ బాద్షా షారుఖ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌ హీరోగా రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కిస్తున్న  ప్రెస్టీజి యస్ మూవీ ‘డంకీ’. షారుఖ్‌‌‌‌కి జంటగా తాప్సీ నటిస్తున్న ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప టికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకోగా, బుధవా రం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను లాంచ్ చేశారు. ‘లుట్ పుట్‌‌‌‌ గయా’ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్‌‌‌‌కు ప్రీతమ్ సంగీతాన్ని అందించగా అర్జిత్ సింగ్‌‌‌‌ పాడాడు. 

స్వానంద్ కిర్‌‌‌‌కిరే, ఐ.పి.సింగ్ లిరిక్స్ రాశారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో షారుఖ్, తాప్సీ జంటపై చిత్రీకరించారు. ఈ రొమాంటిక్ సాంగ్‌‌‌‌లో తనదైన ఎక్స్‌‌‌‌ప్రెషన్స్, డాన్స్ మూమెంట్స్​తో షారుఖ్‌‌‌‌ ఇంప్రెస్ చేశాడు. జియో స్టూడియోస్‌‌‌‌, రెడ్ చిల్లీస్ ఎంట‌‌‌‌ర్‌‌‌‌టైన్మెంట్‌‌‌‌, రాజ్‌‌‌‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 21న సినిమా విడుదల కానుంది.