సేఫ్​గా ఆన్​లైన్ పేమెంట్..

సేఫ్​గా  ఆన్​లైన్ పేమెంట్..

స్మార్ట్​ ఫోన్​ వాడే వాళ్లందరికీ ఆన్​లైన్ పేమెంట్స్ చేయడం బాగా అలవాటైపోయింది. ఈజీగా ట్రాన్సాక్షన్​ అయిపోతుంది అని ఎక్కువగా ఆ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అయితే, ప్రస్తుతం అందులో మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవాలంటే ఈ టిప్స్​ ఫాలో అవ్వాలి. 

గూగుల్ పే, ఫోన్​ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్​ల నుంచి డబ్బు సేఫ్​గా ట్రాన్స్​ఫర్ చేయొచ్చు. అయితే, యూపీఐ పిన్​ ఎవరికీ షేర్​ చేయకూడదు. ఏదైనా మాల్​వేర్ వెబ్​సైట్​ లేదా యాప్​లో పిన్​ రిజిస్టర్​ చేయకూడదు. పిన్​ని కూడా అప్పుడప్పుడు మార్చుతూ ఉండాలి. 

యూపీఐ ద్వారా పేమెంట్​ చేయడానికి ముందు, రిసీవర్​ వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో రిసీవర్​ పేరు, యూపీఐ ఐడీ, మొబైల్ నంబర్​ ఉంటాయి. యూపీఐ యాప్​లోని ‘వెరిఫై పేమెంట్​ అడ్రస్​’ ఫీచర్​ని వాడడం ద్వారా రిసీవర్​ ఐడెంటిటీని కూడా ఓకే​ చేయొచ్చు.

కొన్నిసార్లు ఫోన్​ కూడా హ్యాక్ అవుతుంది. సెక్యూరిటీ యాప్​ను ఇన్​స్టాల్ చేసిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్, యాప్​లను లేటెస్ట్​గా ఉంచడం ద్వారా డివైజ్​ సేఫ్​గా ఉంచుకోవచ్చు. డివైజ్​ లాక్​ చేసేందుకు స్ట్రాంగ్​ పాస్​వర్డ్​ లేదా పిన్​ని కూడా వాడాలి. దాంతోపాటు యూపీఐ పేమెంట్లను చేయాలంటే యాప్​ లాగిన్​ అవ్వడానికి ఫింగర్​ ప్రింట్​ లేదా ఫేస్​ రికగ్నైజేషన్​ వంటి బయోమెట్రిక్​ అథెంటికేషన్​ మెథడ్​ వాడాలి. 

    యూపీఐ యాప్​ కోసం టూ–ప్యాక్టర్డ్​ అథెంటికేషన్ (2FA) ని స్టార్ట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు యూపీఐ పిన్​తో పాటు ఫోన్​ నుంచి కోడ్​ను ఎంటర్​ చేయడం ద్వారా అడ్వాన్స్​డ్ సెక్యూరిటీ పొందచ్చు. ఆన్​లైన్​లో ఏ డేటాను షేర్​ చేస్తున్నారో చూసుకుని చేయాలి. సోషల్ మీడియా లేదా ఇతర పబ్లిక్ ఫోరమ్​లలో మీ యూపీఐ ఐడీ లేదా బ్యాంక్​ అకౌంట్​ నంబర్​ను ఎప్పుడూ చేయకూడదు. వ్యక్తిగత సమాచారం కోసం ఏవైనా ఫేక్ మెసేజ్​లు వస్తే రిజెక్ట్ చేయాలి. యూపీఐ పిన్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ గురించి ఏవైనా ఫోన్​ కాల్స్ లేదా ఈమెయిల్స్ వస్తే వెంటనే డిలీట్​ చేయాలి. 

ఫిషింగ్ స్కామ్
స్కామర్​లు యూపీఐ పిన్​ లేదా బ్యాంక్​ అకౌంట్ నంబర్​ వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడాన్నే ఫిషింగ్ స్కామ్​ అంటారు. ఈమెయిల్స్​, టెక్స్ట్​ మెసేజ్​లు గుర్తు తెలియని నంబర్ల నుంచి పంపుతారు. బ్యాంక్​ లేదా పేమెంట్​ యాప్​లు వంటివి వచ్చినట్టు చూపిస్తుంది. అవన్నీ ఫేక్​ మెసేజ్​లు. అలాంటివేవైనా వస్తే, లింక్​లపై క్లిక్​ చేయకూడదు. ఏవైనా యాడ్ డాక్యుమెంట్​లను ఓపెన్ చేయకూడదు. అందుకు బదులుగా, ఆ మెసేజ్​ వెరిఫై చేయడానికి డైరెక్ట్​గా కంపెనీని సంప్రదించాలి