
భారతీయ వ్యాపారవేత్త తాన్యా దుబాష్ ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ కు కరీనా కపూర్ ఖాన్ నుండి నోరా ఫతేహి వరకు అనేక మంది ప్రముఖులు వివిధ ఆకర్షణీయమైన దుస్తులలో హాజరై పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
బాలీవుడ్ స్టార్ మలైకా అరోరా దీపావళి పార్టీలో తన అందంతో మెరిసింది. గ్రీన్ కలర్ డ్రెస్‌లో కనిపించింది. ఆమె తన జుట్టును పోనీటైల్లో కట్టి, మేకప్ తో ఆకట్టుకుంది. ఆమె తన విలాసవంతమైన కారులోంచి ఫొటోకు ఫోజిస్తూ ఇలా కనిపించింది.
బాలీవుడ్ జంట రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా సైతం ఈ దీపావళి వేడుకకు హాజరయ్యారు. జెనీలియా ఆఫ్-వైట్ సూట్లో నవ్వుతూ అందర్నీ ఆకట్టుకుంది. నటి నోరా ఫతేహి నల్ల టీ-షర్ట్‌పై నల్ల కోటును వేసుకొని ఒక బాస్ లేడీ అవతార్‌లో ఈ పార్టీకి అటెండ్ అయింది. వీరితో పాటు కరీనా కపూర్, డిజైనర్ మనీష్ మల్హోత్రా, నటుడు ఫర్హాన్ అక్తర్ లాంటి చాలా మంది ప్రముఖులు ఈ పార్టీ హాజరై వేడుక చేసుకున్నారు.