ఎందర్ని కలిసినా లాభంలేక పార్టీ ఆఫీస్ కోసం బిక్షాటన చేస్తున్న కాంగ్రెస్ నేత

ఎందర్ని కలిసినా లాభంలేక పార్టీ ఆఫీస్ కోసం బిక్షాటన చేస్తున్న కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించేందుకు ఆ పార్టీ రాష్ట్ర పెద్దలు సహకారం లేకపోవడంతో ఓ మాజీ ఎమ్మెల్యే బిక్షాటన చేపట్టారు.  అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కర్నాటక బాగల్ కోట జిల్లాకు మాజీ ఎమ్మెల్యే నంజయనామత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే బాగల్ కోట జిల్లాలో పార్టీ ఆఫీస్ లేదు. దీంతో పార్టీ కార్యాలయాన్ని రూ.50 లక్షలతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నాం. మీ  ఆర్ధిక సాయం కావాలంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ అదిష్టాన పెద్దల్ని కోరారు. కానీ పార్టీ పెద్దల నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో అసహనానికి గురైన మాజీ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం బిక్షాటన చేస్తున్నారు.

పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం తనతో పాటు కార్యకర్తల నుంచి రూ.3లక్షలు, నలుగురు జిల్లా పార్టీ నేతలు రూ.12లక్షల్ని సమకూర్చారు. బాగల్‌కోట్‌లో ప్రస్తుతం 18 మంది జిల్లా పంచాయతీ సభ్యులు, సుమారు 60 మంది తాలూకా పంచాయతీ సభ్యులు ఉన్నారు. కానీ ఒక్క పైసా కూడా విరాళంగా ఇవ్వలేదు. సాకులు చెప్పి తప్పించుకోవడంతో ఎలాగైనా పార్టీ ఆఫీస్ నిర్మాణ చేపట్టాలని నంజయన్‌మథ్ బిక్షాటన కు శ్రీకారం చుట్టారు. మాజీ ఎమ్మెల్యే బిక్షాటన ఆ నోటా ఈనోటా పాకడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభిమానులే ఇసుక, సిమెంట్ బస్తాల్ని పంపిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా నంజయన్ మథ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం రాష్ట్ర పెద్దల్ని కలిశాం. హామీ ఇచ్చారు. కానీ నిధులివ్వలేదు. నేను ఎవర్ని నిందించడంలేదు. అందుకే విరాళాల కోసం బిక్షాటన చేస్తున్నా. పార్టీపై  విశ్వసనీయత, విధేయత ఉన్నందువల్లే ఎలాగైన పార్టీ ఆఫీస్ ను నిర్మించాలని అనుకుంటున్నానని చెప్పారు. బిక్షాటన చేయకపోతే రాష్ట్రనాయకుల నుంచి విరాళాలు అడగొచ్చుగా అని మీడియా అడగ్గా..బళ్లున నవ్వుతూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు డీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం సిద్ధిరామయ్యలు సైతం విరాళం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు మాకు నిధులు అందలేదు. మాకు ఎవరు నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా బాగల్ కోట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను నిర్మిస్తామని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నంజయనామత్ స్పష్టం చేశారు.