Gaddar Awards: గద్దర్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్.. బెస్ట్ సినిమా కల్కి..

Gaddar Awards: గద్దర్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్.. బెస్ట్ సినిమా కల్కి..

హైదరాబాద్: తెలుగు సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రదానం చేయనుంది. గద్దర్ అవార్డులకు ఎంపికైన సినిమాలను, సినీ నటులను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 14న ఈ అవార్డుల ప్రదాన వేడుక కన్నుల పండుగగా జరగనుంది. 

కవులు, కళాకారులు, సినిమావాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే శాసనమని, తన మాటే జీవో అని అప్పట్లో సీఎం చెప్పిన మాటను తాజాగా నిజం చేశారు. తెలంగాణ లెజెండ్, బ్రాండ్​ అంబాసిడర్​ గద్దర్ అని, ఆయన పేరుపై అవార్డులను ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం విదితమే.

గద్దర్ అవార్డుల ప్రకటన

  • 2024- ఫస్ట్  బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కల్కి 
  • 2024 రెండో ఉత్తమ చిత్రం పొట్టేల్
  • ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్
  • ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప-2)
  • బెస్ట్ డైరెక్టర్-నాగ్ అశ్విన్ (కల్కి)
  • బెస్ట్ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
  • బెస్ట్ కొరియోగ్రాఫర్-గణేశ్ ఆచార్య (దేవర)
  • స్పెషల్ జ్యూరీ అవార్డ్-దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-ఎస్ జె సూర్య (సరిపోదా శనివారం)
  • బెస్ట్ స్టోరీ రైటర్ (శివ పాలడుగు) (మ్యూజిక్ షాప్ మూర్తి)
  • బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
  • ఉత్తమ హాస్యనటులు- సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2)
  • ఉత్తమ బాలనటులు- మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక
  • ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్‌ (రాజూ యాదవ్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌- విశ్వనాథ్‌రెడ్డి (గామి)
  • ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌ (ఊరి పేరు భైరవకోన)
  • ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (పుష్ప 2 చూసేకి)