బరువు తగ్గితే.. కేజీకి 1000 కోట్లు..ఫిట్నెస్పైనే ఎంపీ దృష్టి

బరువు తగ్గితే.. కేజీకి 1000 కోట్లు..ఫిట్నెస్పైనే ఎంపీ దృష్టి

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫిజికల్ ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు అభివృద్ధి పనులకు ఉజ్జయినిలో మాల్వా ప్రాంతానికి వచ్చినప్పుడు.. ఎంపీ అనిల్ ఫిరోజియాను బరువుతో చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఎంపీ తన బరువు తగ్గించుకోవడానికి వినూత్న సవాల్ విసిరారు. ఫిరోజియా తరచు నియోజకవర్గం డెవలప్ మెంట్ కోసం నిధులు అడుగుతుండటంతో ఎంపీకి షరతు పెట్టారు. ఉజ్జయిని అభివృద్ధికి నిధులు కావాలంటే ఎన్ని కేజీల బరువు తగ్గితే.. కేజీకి 1000 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తానని నిబంధన పెట్టాడు. దీంతో ఎంపీ ఫిరోజియా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి వర్కౌట్  చేస్తున్నారు. మూడునెలల్లో 127 కేజీల నుంచి 15 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో బరువు తగ్గిన వివరాలను గడ్కరీకి అందిస్తానన్నారు.  గడ్కరీ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి 15వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఎంపీ అనిత్ ఫిరోజియా.