బస్సుపై గార్డెన్ : సింగపూర్ లో రోడ్డెక్కింది

బస్సుపై గార్డెన్ : సింగపూర్ లో రోడ్డెక్కింది

సింగపూర్ మరోసారి తన ప్రత్యేకత చాటింది. గార్డెన్ ఆన్ ద మూవ్ కాన్సెప్ట్ తో సరికొత్త ఘనత సాధించింది. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా..  రూఫ్ టాప్ లో గార్డెన్ పెంచుతూ సరికొత్త బస్సును రూపొందించింది. ఆదివారం నాడు ఈ బస్సు తొలిసారిగా రోడ్డెక్కింది. సిటీ వాసులను అలరించింది.

అర్బన్ గ్రీనరీ స్పెషలిస్ట్ సంస్థ తమ ఆలోచనను ఇలా అమలులో పెట్టింది. చైనీస్ గార్డెన్ MRT నుంచి.. లేక్ గార్డెన్ వరకు.. షటిల్ సర్వీసులు ప్రస్తుతం నడుపుతోంది.

సింగపూర్ గార్డెన్ ఫెస్టివల్ హార్టికల్చర్ షో త్వరలోనే ఇక్కడ మొదలుకానుంది. అందులో ఈ మూవింగ్ గార్డెన్లనే హైలైట్ చేయబోతున్నారు.

ఈ ప్రయత్నం ఓ ప్రయోగం. 3 నెలల వరకు మూవింగ్ గార్డెన్స్ ను కొనసాగిస్తారు. బస్సులో టెంపరేచర్ తగ్గుతుందా లేదా?… ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ ఏమైనా సాధించామా లేదా? అన్నదానిని బేరీజు వేస్తారు. ఆ తర్వాత వాటి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.

మన ఇండియాలోనూ కొందరు ఈ క్రియేటివిటీని చూపించారు. ఆ మధ్య కోల్ కతాలో.. మొన్న హైదరాబాద్ బేగంపేటలో ఆటోలపై తోటలు కనిపించాయి. వ్యక్తిగతంగా కాకుండా..  ప్రభుత్వాలు చొరవ తీసుకుంటేనే పచ్చదనం ఉద్యమం ఫలితాలనిస్తుందంటున్నారు పబ్లిక్.

.