కరోనా సంక్షోభం.. జర్మనీ మంత్రి ఆత్మహత్య

కరోనా సంక్షోభం.. జర్మనీ మంత్రి ఆత్మహత్య

ఫ్రాంక్ ఫర్ట్: కరోనా సంక్షోభం కారణంగా జర్మనీలోని హిస్సే రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షేఫర్ ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రి డెడ్ బాడీ శనివారం ఓ రైలు పట్టాల పక్కన లభించిందని, ఆయన ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలన్న విషయంలో వేదనకు గురయ్యారని ఆ రాష్ట్ర ప్రీమియర్ వోకర్ బోఫీర్ ఆదివారం వెల్లడించారు. జర్మనీ ఆర్థిక రాజధాని ఫ్రాంక్ ఫర్ట్ నగరం హిస్సే స్టేట్ లోనే ఉంది. ఇక్కడ డ్యూచే బ్యాంక్, కామర్జ్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా పదేళ్లుగా రేయింబవళ్లూ కష్టపడుతూ షేఫర్ బాగా పనిచేశారని, ఆయన లేని లోటు తీరనిదని బోఫీర్ అన్నారు. షేఫర్ బతికుంటే బోఫీర్ తర్వాత ఆ రాష్ట్రానికి ప్రీమియర్ అయ్యేవారని చెప్తున్నారు. వీరిద్దరూ జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సారథ్యంలోని సీడీయూ పార్టీ నాయకులే.

అమెరికాలో 2,363 మంది మరణం