గీతం అడ్మిషన్ల  నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

గీతం అడ్మిషన్ల  నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: గీతం డీమ్డ్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ అయింది. 2022–23 అకడమిక్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు విశాఖపట్నం, బెంగళూరు క్యాంపస్‌‌‌‌‌‌‌‌ల్లో అడ్మిషన్లు ప్రారంభ మయ్యాయని వర్సిటీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీసీ ఎన్‌‌‌‌‌‌‌‌.శివశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.గీతం అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ టెస్టు (గాట్–2022) అప్లికేషన్లను www.gat.gitam.edu లో అందుబాటులో పెట్టామన్నారు. అభ్యర్థులు తమ స్లాట్‌‌‌‌‌‌‌‌ను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకుని, ఇంటి నుంచే ఎంట్రెన్స్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ రాయొచ్చన్నారు. లాగిన్‌‌‌‌‌‌‌‌ వివరాలను ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌కు ఒకరోజు ముందు వెల్లడిస్తామన్నారు.