ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...

ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...

దేశ ప్రజలకు ఐఎండీ గుడ్​ న్యూస్​ ఇచ్చింది...నైరుతి రుతుపవనాలు.. ఇంకొన్ని రోజుల్లో దక్షిణ అండమాన్​ సముద్రం, నికోబార్​ దీవులను తాకనున్నాయి. కేరళను ఎప్పుడు తాకుతాయో.. వాతావరణశాఖ చెప్పిన వివరాలను ఇప్పుడు చూద్దాం. . . .

ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు.. నైరుతి రుతుపవనాల విషయంలో గుడ్​ న్యూస్​ చెప్పింది భారత వాతావరణశాఖ ఐఎండీ. నైరుతి రుతుపవనాలు.. మే 22కు బదులు.. మే 19నే దక్షిణ అండమాన్​ సముద్రం, నికోబార్​ దీవులతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకుతాయని  సోమవారం ( మే 13)  వెల్లడించింది. జూన్​ 1న.. కేరళను  నైరుతి రుతుపవనాలు తాకుతాయని తెలిపింది. అంటే ఇంకొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకుతాయని, జులై 15 నాటికి దేశవ్యాప్తంగా వర్షాల ప్రభావం ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. జూన్​నుంచి - సెప్టెంబర్ వరకు  వర్షాకాలం.. దేశానికి  ఈ సమయం చాలా ముఖ్యం. గతేడాది.. జూన్​ రెండో వారం వరకు.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకలేదు. ఎల్​నీనో ఇందుకు కారణం. కానీ ఇప్పుడు.. జూన్​ 1 నాటికే, అంటే సాధారణ సమయానికే నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకుతాయంటుండటం గుడ్​ న్యూస్​!

రాష్ట్రంలో గతేడాది కంటే ఈ సంవత్సరం మెరుగైన వర్షాలుంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. జూన్‌ 8 నుంచి 11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశిస్తాయని భావిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు జూన్‌- సెప్టెంబరు నెలల మధ్య వానల ప్రభావంపై వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది  (2024) నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా ఎక్కువ ఉంటుందని ఐఎండీ, గత నెలలో వెల్లడించింది. ఎల్​పీఏ (లాంగ్​ పీరియడ్​ యావరేజ్​)లో 106శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక.. నైరుతి రుతుపవనాల కదలికలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్​ ఇస్తూనే ఉంటామని ఐఎండీ తెలిపింది. మే నెల చివరిలో వెలువడే అప్డేట్​ చాలా కీలకంగా మారనుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు ఎలా ఉంటాయో ఓ క్లారిటీ వస్తుంది.1971 నుంచి -2020 వరకు ఎల్​పీఏ 87సెంటీమీటర్లుగా ఉంది. గతేడాది రుతుపవనాల ప్రభావం.. సాధారణం కన్నా తక్కువగా నమోదైంది. ఎల్​పీఏలో 94.4శాతమే నమోదు చేసింది.

ఇదిలా ఉంటే మరోవైపు.. రానున్న 5 రోజుల్లో ( మే 14 నుంచి) .. మధ్యప్రదేశ్​, విదర్భ, ఛత్తీస్​గఢ్​, మధ్య మహారాష్ట్ర, మారాఠ్వాడాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఆయా ప్రాంతంలో కనిపిస్తున్న అల్పపీడణ ద్రోణి ఇందుకు కారణం అని వివరించింది. ఐఎండీ ప్రకారం.. మే 14న మధ్యప్రదేశ్​లో భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న 7 రోజుల్లో పశ్చిమ్​ బెంగాల్​లోని హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, అండామన్​-నికోబార్​ దీవుల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ.. మే 16 నుంచి వాయువ్య భారతంపై వడగాల్పుల ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.