హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. మృతుడిని ఇంటలిజెన్స్ ఏఎస్ఐ రఘుపతి యాదవ్‌గా గుర్తించారు పోలీసులు. ఖైరతాబాద్ సెక్యూరిటీ వింగ్‌లో ఇంటలిజెన్స్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రఘుపతి యాదవ్ సోమవారం (డిసెంబర్ 22) విధులు ముగించుకొని బైక్‌పై అన్నోజిగూడకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో నారపల్లి మసీదు దగ్గర వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో రఘుపతి యాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
