దీపికా పదుకోనెకు గ్లోబల్ అచీవర్స్ పురస్కారం 

దీపికా పదుకోనెకు గ్లోబల్ అచీవర్స్ పురస్కారం 
  • అవార్డుకు ఎంపికైన తొలి భారతీయ నటి దీపిక

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దశబ్దానికి పైగా బాలీవుడ్ హీరోయిన్ గా వెలుగొందుతూ.. పెళ్లయిన తర్వాత కూడా అవకాశాలు అందిపుచుకుంటూ అగ్ర స్థానంలో కొనసాగుతున్న దీపికా పదుకోనె ప్రపంచవ్యాప్తంగా సినీ రంగంలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్న వారికి ఇచ్చే `ది గ్లోబల్ అచీవర్స్ -2021 ` పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ బాలీవుడ్ ఉత్తమ హీరోయిన్ విభాగంలో పురస్కారం దక్కించుకున్న దీపికా పదుకోనె ఇప్పటికీ భారీ పారితోషికం అందుకుంటూ అగ్రతారగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. 2018లో టైమ్ మ్యాగజైన్ రూపొందించిన 100 మంది ప్రతిభావంతుల జాబితాలో దీపిక చోటు సంపాదించిన దీపిక తాజాగా గ్లోబల్ అచీవర్స్ అవార్డును కైవసం చేసుకుంది. 
దశాబ్దం పైగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్న దీపిక తన విభాగంలో 3వేల మందితో కూడిన జాబితాను వడపోసి.. చివరకు పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. `బాలీవుడ్ లో ఉత్తమ నటి` పేరిట ఈ అవార్డును అందుకోబోతున్న తొలి భారతీయ నటి దీపిక పదుకోనె. కుర్ర హీరోయిన్లకు దీటుగా రాణిస్తూ.. నటనలోనూ ప్రాధాన్యం ఉన్న  `రామ్‌లీలా`, `తమాషా`, `పద్మావత్` తదితర చిత్రాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.