భైంసా అల్లర్లకు మేక గొడవే కారణం

భైంసా అల్లర్లకు మేక గొడవే కారణం

నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లకు మేక గొడవే కారణమన్నారు ఐజి నాగిరెడ్డి. అల్లర్లు జరిగిన ప్రాంతంలో పర్యటించిన ఆయన.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ మేక కోసం చిన్న పాటి గొడవతో అల్లర్లు మొదలయ్యాయన్నారు.  ఈ అల్లర్లలో 12 మందికి గాయాలయ్యాయని.. 9 మందికి స్వల్పంగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయన్నారు. గాయాలైన వారిని ఇద్దరు హైదరాబాద్, ఒకరు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. అల్లర్లలో 3 కార్లు, 2 ఆటోలు,6 బైక్ లు, 7 ఇండ్లు పాక్షికంగా,16 షాపులు దగ్ధమయ్యాయన్నారు.   22మందిని అరెస్టు చేశామని..మరో 21మందిని గుర్తించామన్నారు. మొత్తం19 కేసులు నమోదు చేశామన్నారు. అల్లర్లకు కారకులైనా ఎంఐఎం కౌన్సిలర్లు బాబా, స్వతంత్ర  కౌన్సిలర్ విజయ్ లను రిమాండ్ కి పంపామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.