రూ. 3 కోట్లు అప్పు చేసి గవర్నమెంట్ ​టీచర్ ​పరార్

రూ. 3 కోట్లు అప్పు చేసి గవర్నమెంట్ ​టీచర్ ​పరార్
  •    ‘ఐ యామ్​ గోయింగ్​ టు సూసైడ్’​ అంటూ భార్యకు మెసేజ్
  •     ఆందోళనలో అప్పు ఇచ్చినవారు

గద్వాల, వెలుగు: బంధువులు, తెలిసినవారు, తోటి టీచర్ల దగ్గర కలిపి దాదాపుగా రూ.3కోట్లకు పైగా అప్పు చేసిన ఓ ప్రభుత్వ టీచర్ పరారయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఉప్పల్ కు చెందిన ఓ వ్యక్తి గద్వాల మండలంలోని ఓ గవర్నమెంట్​స్కూల్​లో టీచర్ పనిచేస్తున్నాడు. గత 8 నెలల్లో తోటి టీచర్లు, బంధువులు, తెలిసినవారి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. అలా రూ.3కోట్లకు పైగా అప్పు చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద స్కూల్ లోని నలుగురు టీచర్ల నుంచి రూ.10 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. బూరెడ్డి పల్లెకు చెందిన ఓ ఫైనాన్షియర్ నుంచి దాదాపు రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అసలు, వడ్డీ మొత్తం కట్టాలని ఒత్తిడి చేయడంతో ఈ నెల 11న సదరు స్కూల్​టీచర్​తిరుపతికి వెళ్లాడు. అక్కడి నుంచి ‘ఐ యామ్​గోయింగ్ ​టు సూసైడ్’ అంటూ భార్యకు మెసేజ్​పెట్టాడు. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాపాడినట్లు తెలుస్తోంది. తర్వాత కర్నూలులో ట్రీట్​మెంట్​పొందాడని సమాచారం. అయితే ఇప్పటివరకు కనిపించకుండా ఉండడం, ఫోన్ ద్వారా అందుబాటులోకి రాకపోవడంతో అప్పు ఇచ్చినవారంతా ఆందోళన చెందుతున్నారు.