ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ షాకింగ్ డెసిషన్..223 మంది మహిళా కమిషన్ ఉద్యోగుల తొలగింపు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ షాకింగ్ డెసిషన్..223 మంది మహిళా కమిషన్ ఉద్యోగుల తొలగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని మహిళ కమిషన్లోని 223 మంది ఉద్యోగులను తొలగించారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఈ నియమకాలు చేపట్టారని ఆరోపించారు. 

ఆప్ ఎంపీగా ఎన్నికవడానికి ముందు స్వాతి మలివాల్ తొమ్మిదేళ్ల పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ప్రస్తుతం ప్యానెల్ చైర్ పర్సన్ పోస్టు ఖాళీగా ఉంది. నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ఎమ్మెల్యే మలివాల్ కు పదే పదే సూచించినట్లు ఉత్తర్వుల్లో గవర్నర్ చెపుతున్నారు. 

అయితే 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగుల తొలగింపుపై గవర్నర్ నిర్ణయాన్ని ఆప్ ఎంపీ మలివాల్ తప్పుబట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి మహిళ కమిషన్ ను మూసివేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ అని అనడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. ప్యానల్ లో ఇప్పుడు మొత్తం 90 మంది సిబ్బంది ఉన్నారు.. వీరిలో 8 మంది ప్రభుత్వానికి చెందిన వారు కాగా.. మిగిలిన వారు మూడు నెలల కాంట్రాక్టుపై విధులు నిర్వహిస్తున్నారని ఆమె చెప్పారు.

ఈ సంస్థను మా చెమట,రక్తంతో పోషించాం.. తనను జైలు లో పెట్టినా సరే.. మహిళలను మాత్రం హింసించొద్దని మలివాల్ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదంతోనే డీసీడబ్ల్యూ నియామకాలు జరిగాయని ఎంపీ మలివాల్ చెప్పారు.