
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఈవెంట్ కు హాజరైన ఆయన ఐపీఎల్(IPL) క్రికెట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ పై క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు. మేము కూడా మాకు నచ్చినప్పుడు సినిమాలు చూస్తాం అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వీవీ గోపాలకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఈవెంట్ లో అనిల్ కృష్ణమ్మ సినిమా గురించి మాట్లాడుతూ.. సత్యదేవ్ నటన అంటే నాకు చాల ఇష్టం. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి కథకైనా, పాత్రకైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. ఇక కృష్ణమ్మ సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడండి.. అంటూ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు.. ఐపీఎల్ గురించి మాట్లాడిన అనిల్.. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు 2 రోజులు చూడకుంటే కొంపలేమీ మునిగిపోవని, క్రికెట్ స్కోర్ ఫోన్లలో కూడా చూసుకోవచ్చని, ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలని చెప్పొకొచ్చారు అనిల్. దాంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవగా.. క్రికెట్ అభిమానులు, నెటిజన్స్ అనిల్ పై ఫైర్ అవుతున్నారు. మీ సినిమాలు కూడా నెల తరువాత ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా?.. అప్పుడు చూస్తామని, ఇతరుల ఇష్టాయిష్టాల గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని.. అంటూ కౌంటర్లు వేస్తున్నారు.