చెస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ బరిలో అర్జున్‌‌‌‌‌‌‌‌, హర్ష

చెస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ బరిలో అర్జున్‌‌‌‌‌‌‌‌, హర్ష

బాకు (అజర్‌‌‌‌‌‌‌‌బైజాన్‌‌‌‌‌‌‌‌): తెలంగాణకు చెందిన  యంగ్​ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ ఎరిగైసి, హర్ష భరతకోటి చెస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగనున్నారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు24 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో టాప్​ ప్లేయర్లు  కోనేరు హంపి, హారిక కూడా పోటీలో నిలిచారు. ఈ ఇద్దరికి తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో బై లభించింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డ్రాలో ఆర్‌‌‌‌‌‌‌‌. వైశాలి, మేరీ ఆన్‌‌‌‌‌‌‌‌ గోమ్స్‌‌‌‌‌‌‌‌, పీవీ నందిదా, దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

ALSO READ :హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు టీ20, టెస్టు మ్యాచ్​..షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన బీసీసీఐ

మెన్స్‌‌‌‌‌‌‌‌ డ్రాలో గుకేశ్‌‌‌‌‌‌‌‌, ప్రజ్ఞానంద, విదిత్‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌, నిహాల్‌‌‌‌‌‌‌‌ సరిన్‌‌‌‌‌‌‌‌, అధిబన్‌‌‌‌‌‌‌‌, అభిమన్యు తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు. ప్రతి సెక్షన్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌–2లో నిలిచిన ప్లేయర్లు క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అవుతారు. ఇక వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ మాగ్నస్‌‌‌‌‌‌‌‌ కార్ల్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ డింగ్‌‌‌‌‌‌‌‌ లిరెన్‌‌‌‌‌‌‌‌, అలిరెజా ఫిరౌజ, ఇయాన్‌‌‌‌‌‌‌‌ నెపోమ్నియాచి, ఫ్యాబియానో కారువాన, హికరు నకామురా, అనీష్‌‌‌‌‌‌‌‌ గిరి, వెస్లీ సో, వాచిర్‌‌‌‌‌‌‌‌ లాగ్రెవ్‌‌‌‌‌‌‌‌, తైమూర్‌‌‌‌‌‌‌‌ రజ్దబోవా, క్రిస్టాఫ్‌‌‌‌‌‌‌‌ డుడా తదితర వరల్డ్  స్టార్లు  కూడా ఈ టోర్నీ బరిలో ఉన్నారు.